ఉత్తమ నటీనటులు విద్య, రణ్‌బీర్:13వ ఇఫా అవార్డుల ప్రదానోత్సవం..

ఉత్తమ చిత్రం ‘జిందగీ న మిలే న దొబారా’
ఈ సినిమాకు మొత్తం నాలుగు అవార్డులు
ఉత్తమ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ (రాక్‌స్టార్)
ఉత్తమ విలన్ ప్రకాశ్‌రాజ్ (సింగం)
నిన్న సింగపూర్‌లో 13వ ఇఫా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంలో నటనకుగాను విద్యాబాలన్, రాక్‌స్టార్ చిత్రంలో నటనకుగాను రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటీనటుల అవార్డులను అందుకున్నారు. జిందగీ న మిలే దొబారా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకోగా, సింగం చిత్రంలో నటనకుగాను దక్షిణాది నటుడు ప్రకాశ్‌రాజ్ ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నారు. నిన్నటితరం బాలీవుడ్ నటి రేఖను ఔట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డుతో నిర్వాహకులు సత్కరించారు. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను అందించారు.

posted in: Entertainment, Hindi, News Update

Leave a Reply