ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబధ్దత తేవాలి:సబ్ ప్లాన్ జేఏసీ

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు వెంటనే చట్టాన్ని తీసుకురాకపోతే మళ్లీ ఉద్యమం చేపడుతామని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఐక్యకార్యాచరణ హెచ్చరించింది. ఎస్సీ, ఎస్టీల నిధులు నేరుగా వారికే అందేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం డిమాండ్లతో కూడిన వినతి ప్రత్రాన్ని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి ఐక్యకార్యాచరణ నాయకులు రిటైర్డ్ ఐఎఎస్ మాధవరావు, మల్లేపల్లి లక్ష్మయ్య అందజేశారు. సబ్ ప్లాన్ అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

posted in: News, News Update, State

Leave a Reply