కరీంనగర్ లో డ్రగ్స్ కలకలం

కరీంనగర్ మాదకద్రవ్యాల విక్రయ కేంద్రంగా మారుతోంది. నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. డిగ్రీ చదువుతున్న దీక్షిత్ , ప్రశాంత్, నవీన్ లు హైదరాబాద్ కు చెందిన స్వామి అనే వ్యక్తి నుంచి కొకైన్ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మరోవైపు మగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా కంటపడకుండానే కోర్టులో హాజరుపరిచారు.

posted in: News Update, State

Leave a Reply