కేశూభాయ్ పటేల్ కొత్తపార్టీ

గుజరాత్ లో కొత్త రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో నేతలు చకచకపావులు కదుపుతున్నారు. సీఎం నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీ నుంచి బయటికొచ్చిన సీనియర్ నేత కేశూభాయ్ పటేల్ కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించారు. కేంద్ర మాజీ మంత్రి కాన్షీరాం రాణా కూడా ఇందులో చేరారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసిన కేశూభాయ్ గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లోనూ జీపీపీ పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని తమ పార్టీ మార్చేంస్తుందన్నారు. రాష్ట్ర గౌరవం, సమక్యత పట్ల మోడీ రాజీపడుతున్నారని..వాటిని తమ పార్టీ కాపాడుతుందని హామీ ఇచ్చారు కేశూభాయ్ పటేల్. తమ పార్టీ మహాత్మాగాంధీ, రవి శంకర్ మహరాజ్, సర్దార్ వల్లభాయ్ పటేల్,ఇందులాల్ యాగ్నిక్ ల సి ద్ధాంతాలను అనుసరిస్తుందన్నారు. మరోవైపు రాష్ట్ర మాజీ మంత్రి గోర్ధాన్ జదాఫియాకు చెందిన మహా గుజరాత్ జనతా పార్టీ త్వరలోనే జీపీపీ లో విలీనమవుతుందని కేశూభాయ్ తెలిపారు.

posted in: National, News, News Update

Leave a Reply