ఘంటసాల సంగీత కళాశాల ప్రారంభం

ద్వారకానగర్ లోని స్థానిక డైమండ్ పార్కు సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన ఘంటసాల సంగీతకళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటులు పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్లొన్నారు. ఘంటసాలతో తనకు అవినాభ సంబంధముందన్నారు. తామిద్దరూ ఒక ఏడాది వ్యవధితో సినీ అరంగేట్రం చేశామని అన్నారు. ఘంటసాల,ఎస్వీఆర్,సావిత్రి, సూర్యకాంతం వంటి కళాకారులను ఇక చూడలేమని, ఘంటసాల పేరుతో సంగీత కళాశాలను స్థాపించడం అభినందనీయమన్నారు.ఈకార్యక్రమంలో రావికొండలరావు,రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,ఉడా పీఆర్ ఓ ప్రభాకరరెడ్డి, ఘంటసాల సంగీత కళాశాల గౌరవ అధ్యక్షులు సన్యాసిరాజు పాల్గొన్నారు.

posted in: Entertainment, News Update, State

Leave a Reply