రేవ్ పార్టీలో పట్టుబడ్డ క్రికెటర్ రాహుల్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం టీమిండియాతో శ్రీలంక టూర్‌లో ఉన్న రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఐపిఎల్ సీజన్‌లో ముంబైలో జరిగిన రేవ్ పార్టీలో లెగ్‌స్పిన్నర్ రాహుల్, సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వేన్ పార్నెల్‌లు డ్రగ్ పార్టీలో దొరికారు. వీరిపై నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లు పాజిటివగా తేలాయి. దీంతో క్రికెటర్ భవిష్యత్తు అయోమయంలో పడింది.
అయితే రాహుల్ శర్మపై వచ్చిన నివేదికలను పూర్తిగా పరిశీలించాలని బిసిసిఐ భావిస్తోంది. రాహుల్‌పై నిషేధం విధించాలంటే తమకు ప్రూఫ్ కావాలంటూ బిసిసిఐ తెలిపింది. మరోవైపు పోలీసులు మాత్రం పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల్ని అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు.


Crime Promo
Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo