చైనా మధ్యప్రాంతంలోని హునాన్ రాష్ట్రం భారీ వర్షాలు, భీకర వరదలతో తల్లడిల్లుతోంది. వరదలకు ఇప్పటికే వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జియాంగ్‌జీ తుజియా స్వయంపాలనా ప్రాంతాల్లో ఒక్క బుధవారం నాడే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు కాలువలుగా మారాయి.
ఊళ్ళు జలాశయాలను తలపిస్తున్నాయి. వరదల ధాటికి ప్రాధమిక అంచనాల ప్రకారం మూడోవంతు పంట నీటిపాలైంది. బారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. భారీ వర్షాలు, వరదలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాయి.


Crime Promo
Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo