పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకంపై రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లాలో విద్యార్ధి సంఘాలు పోరాటాన్ని ఉదృతం చేశాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

posted in: News, News Update, State

Leave a Reply