పోలవరం టెండర్లకు వ్యతిరేకంగా ధర్నా

పోలవరం టెండర్ల ప్రక్రియ నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఎదుట యువ ఒడిషా ప్రతినిధులు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ఏపీ సర్కారు సిద్ధమవడంపై నిరసన వ్యక్తం చేశారు .పోలవరం వల్ల ఒడిషాలోని మల్కాన్‌ గిరి జిల్లా గిరిజనులు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల పంట భూములు నీట మునుగుతున్నారు. ఏపీ సర్కారు టెండర్ల ప్రక్రియను ఆపేయాలని కోరారు. సుప్రీం కోర్టులో కేసు తెలేంత వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మించవద్దని డిమాండ్ చేశారు.

posted in: National, News, News Update

Leave a Reply