అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ తన కుమార్తె చెల్సితో కలిసి నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాను కలిశారు. సౌతాఫ్రికాలోని మండేలా స్వగ్రామం కును వెళ్ళి మరీ ఆత్మీయతను పంచుకున్నారు. వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న 94ఏళ్ల మండేలాతో గంటన్నరపాటు గడిపిన క్లింటన్ జాత్యహంకారానికి వ్యతిరేకంగా మండేలా చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. వయసు కారణంగా వృద్ధుడిలా కనిపిస్తున్నా.. మానసికంగాను, ఆలోచనల పరంగాను మండేలా నిత్య యవ్వనుడని క్లింటన్ ప్రశంసించారు.
యువతకు స్ఫూర్తినిచ్చే మండేలాను కలుసుకోగలగడం తన అదృష్టంగా క్లింటన్ చెప్పారు. జీవితకాలంలో ఒక మహనీయుడిని సందర్శించినందుకు గుర్తుగా క్లింటన్ కునులో మొక్కలు నాటారు. మండేలా, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఫోటోలు దిగారు. చిరునవ్వుతో కనిపించిన మండేలా వీల్‌ఛైర్‌లోనే కూర్చుని క్లింటన్‌తో ఆత్మీయంగా సంభాషించారు.


Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo
Teenmar Bullet Promo