మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. గత వారాంతంలో యూరోప్‌, అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫేస్‌బుక్‌ షేరు ధర నిరాశపర్చడంతో నాస్‌డాక్‌ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ఉండగా మిగిలిన సూచీలు ఓ మాదిరిగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టీ 15 పాయింట్ల దాకా కోల్పోతూ 4,885 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది.

posted in: Business, National, News

Leave a Reply