రేప్ కేసులో పింకి ప్రమాణిక్ కు బెయిల్

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక గ్రహీత,అథ్లెట్ పింకి ప్రమాణిక్ కు 25 రోజుల జుడీషియల్ కస్టడీ అనంతరం బెయిల్ లభించింది. పింకి మహిళ కాదని.. తనపై పలుమార్లు రేప్ చేశాడని ఆరోపణలు చేయడంతో పింకి ప్రమాణిక్ ను జూన్ 14 తేదిన అరెస్ట్ చేసారు. పింకి వేధింపులపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోల్ కతా హైకోర్టులో జౌలై 6 తేదిన పిల్ దాఖలైంది. దాంతో విచారణ దశను తెలుపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పింకి లింగ నిర్ధారణను ధృవీకరించే నివేదిక సోమవారం ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రి నుంచి అందింది.

posted in: National, News, News Update, Sports

Leave a Reply