రేవ్ పార్టీపై హిందూ సంస్థ దాడి

కర్ణాటకలోని ఓ రిసార్ట్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుండగా దాంట్లో పాల్గొన్న యువతీ, యువకులపై హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు దాడి చేశారు. మంగళూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న మార్నింగ్‌ మిస్ట్‌ రిసార్ట్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందనే సమాచారం సేకరించిన కార్యకర్తలు, హఠాత్తుగా దాడికి పాల్పడ్డారు. అక్కడ అర్ధనగ్నంగా వున్న యువతీ యువకులను చితక్కొట్టారు. అమ్మాయిలను జుట్టుపట్టుకుని ఈడ్చారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి 20 మంది యువతీ యువకులను అరెస్ట్‌ చేశారు. రేవ్‌ పార్టీ ముసుగులో రిసార్ట్స్‌లో వ్యభిచారం జరుగుతోందని హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు ఆరోపించారు.

posted in: National, News, News Update

Leave a Reply