లంకతో నేడు టీమిండియా తొలివన్డే

క్రికెట్‌ పండగ మళ్లీ వచ్చేసింది. ఒలింపిక్‌ ఫీవర్‌తో ఊగిపోతున్న ప్రపంచానికి తానూ ఉన్నానని గుర్తు చేస్తోంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత శ్రీలంకతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌ ఆడబోతోంది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర నుంచి హంబన్‌టోటాలో తొలి వన్డే జరుగుతుంది.

నేటి నుంచి లంక టూర్‌ వచ్చే నెల 7 వరకూ సాగుతుంది. ఈరోజు హంబన్‌టోటాలో తొలి వన్డే.. 24న అదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. ఇక ఈ నెల 28న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మూడో వన్డే, 31న అక్కడే నాలుగో వన్డే జరుగుతుంది. చివరి వన్డే వచ్చే నెల 4న పల్లెకిలెలో జరుగుతుంది. ఏకైక టీ20 మ్యాచ్‌ కూడా అదే వేదికలో వచ్చే నెల 7న జరుగుతుంది. చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ సేన.. ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

This entry was posted in News, News Update, Sports. Bookmark the permalink.

Leave a Reply