హైదరాబాద్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. బాలానగర్‌లోని హిల్‌కాలనీలో కంపెనీ ప్రహారీ గోడ కూలీ ఐదుగురు కూలీలు మృతి చెందారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీవర్షానికి ఈ ప్రహారీగోడ కూలినట్లు సమాచారం. మృతులు ముగ్గురు మధ్యప్రదేశ్ మన్సూర్ జిల్లాకు చెందినవారిగా భావిస్తున్నారు. మరో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా సహాయచర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి.
కాగా హఫీజ్పేట్ ఆదిత్యనగర్లో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో తల్లి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Crime Promo
Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo