నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ ఆరు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను కంట్రోల్ రూముల నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని సూచించారు. వైద్యం, పారిశుద్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
వర్షాల వల్ల ఏర్పడే సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ కింది నెంబర్లలో సంప్రదించవచ్చు.
జీహెచ్‌ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ: 23314289, 23394566
సెంట్రల్ జోన్, ఖైరతాబాద్: 23322978
ఈస్ట్ జోన్, ఎల్బీనగర్: 24043600, 24140937
సౌత్ జోన్, ఓల్డ్ సిటీ: 24500254, 24419508, 9989930671
వెస్ట్ జోన్, కూకట్ పల్లి: 23010062, 23011963
నార్త్‌జోన్, సికింద్రాబాద్: 27807321


Crime Promo
Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo