వివరాలు లేకపోతే మంత్రి పార్థసారథి పై కేసు: భన్వర్ లాల్

మంత్రి పార్థసారధి ప్లెక్సీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్  స్పందించారు. రాజ్యాంగానికి విరుద్దంగా తప్పుడు  అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికయిన మంత్రి పార్ధసారథిపై చర్యలు తీసుకోవాలంటూ పెనమలూరు నియోజక వర్గ ప్రజలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఓ ప్లెక్సీని కట్టారు. కుటుంబ సమేతంగా కళాక్షేత్రానికి వచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్  స్పందించారు. అఫిడవిట్ లో వివరాలు లేకపోతే సెక్షన్ 125ఏ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. అయితే ఇలా ప్లెక్సీలు ఏర్పాటు చేయటం సరికాదన్నారు భన్వర్ లాల్.

posted in: News, News Update, State

Leave a Reply