వివాదంలో ‘హీరోయిన్’ చిత్రం

సినిమా మొదలు పెట్టక ముందు నుంచీ ‘హీరోయిన్‌’ వార్తల్లో చోటు సంపాదిస్తూనే ఉంది. ఐశ్వర్యరాయ్‌తో ఆరంభిస్తామన్నప్పుడు, ఆ తరువాత ఐశ్వర్య ఈ చిత్రం నుంచి వైదొలిగినప్పుడు, ఆపైన ‘హీరోయిన్‌’గా కరీనా నటిస్తానన్నప్పుడు- అన్నిటా ఈ సినిమా ఆసక్తి కలిగిస్తూనే ఉంది.

ఎట్టకేలకు కరీనా కపూర్‌తో మధుర్‌ భండార్కర్‌ ఎంచక్కా ‘హీరోయిన్‌’ చిత్రాన్ని పూర్తి చేసి, విడుదలకు సిద్ధం చేశాడు. ఇప్పుడు ఈ సినిమా వాల్‌ పోస్టర్స్‌లో కరీనాకపూర్‌ సిగరెట్‌ తాగుతూ దర్శనమివ్వడాన్ని కొంతమంది సామాజిక సేవకుల నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. ఈ పోస్టర్‌ సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని సమాజ సేవకులు ఆందొళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌లోని దృశ్యాలు సైతం అసభ్యంగా ఉన్నాయని మరికొందరు అంటున్నారు.

ఏది ఏమైనా ‘హీరోయిన్‌’ మళ్ళీ వార్తల్లో విశేషమైన స్థానం సంపాదించుకుంటోంది…ఈ సినిమా ఏ కథానాయిక జీవితం ఆధారంగా తీయలేదని, పలువురు నాయికలను చూసిన స్ఫూర్తితో ‘హీరోయిన్‌’ కథ రాసుకున్నానని మధుర్‌ అంటున్నాడు… విడుదలయ్యాక మళ్ళీ మరో సంచలనం కోసం ఆ ఊసులు దాచుకున్నాడేమో అని ముంబయ్‌ జనం చెబుతున్నారు… మరి ‘హీరోయిన్‌’ సక్సెస్‌కు ఈ కాంట్రవర్సీస్‌ ఏ విధంగా ఉపయోగపడతాయో చూడాలి.

posted in: Entertainment, Hindi, News, News Update

Leave a Reply