సినీనటి కమలాదేవి మృతి

అలనాటి సినీ నటి, గాయని టి.జి. కమలాదేవి (84) కన్నుమూశారు. ఆమె తెలుగు, తమిళంలో సుమారు. 50 చిత్రాలకు పైగా నటించారు. గుణసుందరి, పాతాళభైరవి, మల్లీశ్వరీ, బాలనాగమ్మ, పల్లెటూరు, భక్త రామదాసు, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, ఇల్లరికం తోడు దొంగలు, పల్లెటూరు, చక్రపాణి, వెలుగు నీడలు, బంగారు పంజరం, కంచుకోట, పెత్తందార్లు, అభిమానవతి తదితర చిత్రాల్లో నటించారు కమలాదేవి. ఆమె పలు చిత్రాలో పాటలు కూడా పాడారు. కమలాదేవి స్వస్థలం చిత్తూరు జిల్లా, కార్వేటినగరం. ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమి ఆమెకు నాటక కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించారు. కమలాదేవి మృతికి తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

posted in: National, News, News Update, State

Leave a Reply