నగర వాసులను అట్రాక్ట్ చేస్తున్న రెంటెడ్ డ్రెస్

నగర వాసులను అట్రాక్ట్ చేస్తున్న రెంటెడ్ డ్రెస్

బట్టలు అంటే అందరికి ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలకు ఎన్ని ఉన్నా సరిపోవు. ప్రతి ఒకేషన్ కు కొత్త డ్రెస్ ట్రై చేస్తుంటారు. వేసిన బట్టలు వేయకుండా షాపింగ్ చేస్తుంటారు, ఇలా ప్రతి సారి వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. లేడీస్ కు కొత్త దుస్తులపై ఉన్న ఇంట్రెస్ట్ మరి ఎక్కవ. మార్కెట్ లోకి ఎలాంటి  కొత్త మోడల్ వచ్చినా ఆ నయా డిజైన్ వేసుకోవాలనుకుంటారు. మూడు నాలుగు సార్లు వేసుకుంటే దానిపై ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పటిదాకా రెంట్ హౌస్, రెంట్ కార్, రెంట్ ఫర్నిచర్ వంటివి మాత్రమే చూశాము. ఇప్పుడు రెంట్-ఏ - డ్రెస్ కాన్సెప్ట్ నగర వాసులను అట్రాక్ట్ చేస్తోంది. డ్రెస్ ఫర్ రెంట్ అనే న్యూ కాన్సెప్ట్ తో ‘వేదాస్ కోటోర్’   పేరుతో ఓ బోటిక్  ముందుకు వచ్చింది

రెంటెడ్ డ్రెస్ అనే కాన్సెప్ట్ ను తక్కువ ఖరీదులో ఫస్ట్ తామే స్టార్ట్ చేశామంటున్నారు. డ్రీమ్ డ్రెస్ లను అందుబాటులో తేవడానికి ఈ ఐడియా వచ్చిందని వేదాస్ కోటోర్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. డ్రెస్ రేట్ లో 20 - 50 పర్సెంట్ కు రెంట్ కు ఇస్తారు. రెండు వేల నుండి పదివేల వరకు ఒక డే కు ఛార్జ్ చేస్తారు. ఇచ్చే ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఫాబ్రిక్, మోడల్ బట్టి 50 శాతం నుండి అడ్వాన్స్ గా పెట్టుకుంటారు. ప్రతి యూస్ తర్వాత డ్రై వాష్ చేయ్యడంతో పాటు మంచి క్వాలిటీ తో రెంటుకు ఇస్తున్నామని, అమ్మాయిలకు హాఫ్ శారీస్, శారీస్ గౌన్స్, లెహంగాస్ ఫ్రాక్స్, అబ్బాయిలకు బ్లేజర్స్ కాంబో షర్ట్స్ ని కూడా  డిజైనర్ వేర్ లో రెడీ చేశామని బోటిక్ ఓనర్ వెల్లడిస్తున్నారు. ఎక్కువగా పెళ్లిలకు, పార్టీలకు డిఫరెంట్ గా కనిపించేందుకు సెలబ్రిటీ స్టైల్ ను అమ్మాయిలు ప్రిఫర్ చేస్తున్నారని చెబుతున్నారు.

హెవీ లుక్ తో ఉండే బ్రైడల్ లెహంగా కొనాలంటే రూ. 30 వేల పై మాటే. రెంటెడ్ బేస్ లో దొరికితే ఒక ఒక డ్రెస్ కాస్ట్ కే ఐదు సార్లు రెంట్ కి తీసుకోవచ్చని మహిళలు అంటున్నారు. ఎక్కువగా ఫ్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెటర్నిటీ షూట్స్ గౌన్స్ కొంటున్నామంటున్నారు. ఎక్కువగా ఫ్యామిలి ఫోటో క్లిక్స్ కోసం మేన్స్ అవుట్ ఫీట్స్ రెంట్ కి ప్రిపేర్ చేస్తున్నారని తెలిపారు. హైర్ క్వాలిటీ బాగుండడంతో పాటు ఆల్టరేషన్ కూడా చేస్తారని అమ్మాయిలు అంటున్నారు. గతంలో పిల్లల స్కూల్ ఫంక్షన్స్, సినిమా ఆర్టిస్ట్ లకు మాత్రమే పరిమిత అయిన రెంటేడ్ డేస్ వేర్ ఇప్పుడు పెళ్లిలకు కూడా వచ్చింది.